: తిరుపతి చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం తిరుపతికి చేరుకున్నారు. తిరుపతిలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించతలపెట్టిన 104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ప్రధానికి గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడు, తదితర ప్రముఖులు స్వాగతం పలికారు.