: థాయ్ లాండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం... నిమిషాల్లోనే కాలి బూడిదైపోయిన 25 మంది!
థాయ్ లాండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చోన్ బురి ప్రావిన్స్ లో ఉన్న బన్ బుంగ్ జిల్లాలోని హైవేపై వెళుతున్న వ్యాన్ అదుపుతప్పి, డివైడర్ ను ఢీకొని ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొంది. వెంటనే వ్యానులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో వ్యానులోని 25 మంది నిమిషాల వ్యవధిలోనే కాలి బూడిదైపోయారు. మరో ఇద్దరు వ్యక్తులు మాత్రం తమ ప్రాణాలను కాపాడుకోగలిగారు. దీనిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారి కల్నల్ దుసాదీ మాట్లాడుతూ, ఇలాంటి ఘటన జరగడం కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.