: వడ్డీ రేట్ల తగ్గింపు... ఎస్బీఐ వెంటే నడిచిన ఐసీఐసీఐ!


గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకుని నెలవారీ కిస్తీలు కడుతున్న వారందరికీ శుభవార్తలు వినిపిస్తున్నాయి. తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటిస్తున్న బ్యాంకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, కోటక్ మహీంద్రా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీలు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించగా, ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ సైతం ఈ జాబితాలో చేరిపోయింది. మరింత చౌకగా రుణాలిస్తామంటూ 0.70 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీ రేటును తగ్గిస్తున్నామని, ఇకపై తమ బేస్ రేటు 8.20 శాతంగా ఉంటుందని ప్రకటించింది. ఈ రేట్లు 3వ తేదీ మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.

  • Loading...

More Telugu News