: తెలంగాణకు కొత్త గవర్నర్... నరసింహన్ స్థానంలో శంకరమూర్తి... రెండు రోజుల్లో ఉత్తర్వులు!


భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కర్ణాటక విధాన పరిషత్ చైర్మన్ గా సేవలందిస్తున్న డీ హెచ్ శంకరమూర్తి తెలంగాణ గవర్నర్‌ గా నియమితం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో శంకరమూర్తి నియామకానికి మోదీ పచ్చజెండా ఊపినట్టు సమాచారం. గత వారంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలు శంకరమూర్తితో చర్చించి, ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. శంకరమూర్తి నియామకంపై మరో రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు కూడా జారీ అవుతాయని అంచనా.  

  • Loading...

More Telugu News