: ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల కారణాన్ని అమెరికాయే గుర్తించలేకపోయింది.. పవన్ చెబితే చర్యలు తీసుకుంటాం: మంత్రి కామినేని


శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు అధికంగా ఉండటానికి గల కారణాలను అమెరికా వైద్యుల బృందమే గుర్తించలేకపోయిందని ఏపీ వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ ఉదయం పవన్ కల్యాణ్ ఉద్దానం పర్యటనను ప్రస్తావిస్తూ, కిడ్నీ వ్యాధులకు కారణాలను పవన్ తెలియజేస్తే, అందుకు తగ్గ చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇప్పటికే ప్రజల ఆహారపు అలవాట్లు, వాతావరణం, నీటి నమూనాలను సేకరించామని అన్నారు. ముంబైలోని పరిశోధనా సంస్థలో వాటి విశ్లేషణలు జరుగుతున్నాయని, ఇప్పుడిలా అకస్మాత్తుగా వచ్చి విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం లేదని అన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్ తో పాటు, టెక్కలిలో 2 డయాలసిస్ కేంద్రాలు నడుస్తున్నాయని, ప్రజల అవసరార్థం 5న పాలకొండలో మరో కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News