: ఉద్దానంకు పవన్, నెల్లూరుకు జగన్... నేడు పరామర్శల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ లో నేడు పరామర్శలు వెల్లువెత్తనున్నాయి. నెల్లూరు జిల్లాలో బాణసంచా పేలుడులో మరణించిన వారి కుటుంబాలను, గాయపడ్డ వారిని వైకాపా అధినేత, విపక్ష నాయకుడు వైఎస్ జగన్ పరామర్శించనుండగా, శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ ఉదయం కిడ్నీ బాధితులను ఆయన పరామర్శిస్తారు. గత 20 సంవత్సరాల వ్యవధిలో ఉద్దానం, కవిటి, ఇచ్చాపురం ప్రాంతాల్లో కిడ్నీ రోగాలతో దాదాపు 20 వేల మంది మరణించిన సంగతి తెలిసిందే. బాధితుల పరామర్శ అనంతరం ఇచ్చాపురంలో జనసేన సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కిడ్నీ బాధితుల సమస్యలపై పవన్ ప్రసంగించనున్నారు.