: ఫిబ్రవరి చివరి నాటికి నగదు కొరత సమస్య తగ్గుతుంది: ఎస్బీఐ చీఫ్ అరుంధతి
ఫిబ్రవరి చివరి నాటికి నగదు కొరత సమస్య కొంత తగ్గి సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ అరుంధతి భట్టాచార్య అన్నారు. ఈరోజు ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి అనుమతి రాని కారణంగా ఎస్బీఐ లో దాని అనుబంధ శాఖలు, భారతీయ మహిళా బ్యాంకు విలీన ప్రక్రియ ఆలస్యం కానుందని అన్నారు. గత త్రైమాసికంలో విలీన ప్రక్రియకు సంబంధించిన పనులు ఆశించినంత వేగంగా జరగలేదని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. ఈ విలీనం కనుక జరిగితే ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఎస్బీఐ కూడా ఒకటిగా అవతరిస్తుందని, బ్యాంకు ఆస్తులు రూ.37 ట్రిలియన్లకు చేరతాయని అన్నారు.