: చిరంజీవి కూతురికి ధన్యవాదాలు చెప్పిన హీరోయిన్
ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కుమార్తె కొణిదెల సుస్మితకు నటి రాయ్ లక్ష్మీ (లక్ష్మీ రాయ్) ధన్యవాదాలు తెలిపింది. 'ఖైదీ నెంబర్ 150'లో తనను అందంగా చూపిన చిత్ర యూనిట్ కు ధన్యవాదాలని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపిన రాయ్ లక్ష్మీ... కొణిదెల సుస్మితకు ప్రత్యేక ధన్యవాదాలని చెప్పింది. 'రత్తాలు'గా తనను చాలా అందంగా చూపించారని పేర్కొంది. కాగా, ఈ సినిమాకు సుస్మిత డిజైనర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఐటెం సాంగ్ 'రత్తాలు' మేకింగ్ వీడియోను చిత్రయూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేయగా, అభిమానులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.