: కరీనా ఐటీ అకౌంట్ హ్యాక్ చేసింది.. వీరాభిమాని!


ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఐటీ వివరాలను హ్యాక్ చేసిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. కరీనాకపూర్ సీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబయిలోని  సైబర్ సెల్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, పారా మిలిటరీ బలగాలకు చెందిన ఇరవై ఆరు సంవత్సరాల ఒక వ్యక్తి, కరీనా కపూర్ ఐటీ వివరాలను హ్యాక్ చేశాడన్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో కరీనాకు సంబంధించిన ఇన్ కం ట్యాక్స్ అకౌంట్స్ హ్యాక్ అయినట్లు తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు.

ఈ నేపథ్యంలో దర్యాప్తులో పలు వివరాలు వెలుగులోకి వచ్చాయని, పారామిలిటరీ బలగాలకు చెందిన ఈ వ్యక్తి, ఆన్ లైన్ లో ఇన్ కం ట్యాక్స్ రిటర్స్న్ ఫైల్ చేసే విషయమై తన కొలీగ్స్ కు ఈ వ్యక్తి సహకరిస్తూ ఉంటాడని పేర్కొన్నారు.  నిందితుడిని నిన్న పోలీసులు ప్రశ్నించగా మరో ఆసక్తికరమైన విషయం చెప్పాడు. కరీనాకపూర్ కు తాను వీరాభిమానినని, ఆమె మొబైల్ నంబర్ తెలుసుకుంటే తనతో మాట్లాడవచ్చని అనుకున్నానని, అందుకే, ఈ హ్యాకింగ్ కు యత్నించానని చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు.
   

  • Loading...

More Telugu News