: చంద్రబాబు చేతుల మీదుగా 11న పులివెందులకు సాగునీరు విడుదల
ఈ నెల 11న పులివెందుల నియోజకవర్గానికి సాగునీటిని విడుదల చేయనున్నట్లు ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కడప జిల్లాలోని గండికోట ఎత్తిపోతల పథకాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం, దేవినేని ఉమ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పులివెందుల నియోజకవర్గానికి సాగునీరు విడుదల చేస్తామన్నారు.