: ఈసీని కలిసిన ములాయం, అమర్ సింగ్, జయప్రద, శివపాల్ యాదవ్
ఉత్తరప్రదేశ్ లోని సమాజ్‌వాదీ పార్టీ సంక్షోభం నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఎలక్షన్ కమిషన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వెంట గతంలో ఆ పార్టీ నుంచి బహిష్కారానికి గురైన అమర్ సింగ్, జయప్రద, సోదరుడు శివపాల్ యాదవ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీ గుర్తు సైకిల్ తనకు మాత్రమే చెందుతుందని ములాయం ఆయన ఎన్నికల సంఘానికి స్పష్టం చేశారు.