: ఈ నెల 5న నిర్వహించాల్సిన ములాయం సమావేశం రద్దు


సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ ఈ నెల 5వ తేదీన నిర్వహించతలపెట్టిన సమావేశం రద్దు అయింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, సమాజ్ వాదీ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ములాయంను తొలగించి, ఆ స్థానంలో సీఎం అఖిలేష్ యాదవ్ ను నియమించారు. పార్టీలో అత్యధిక శాతం ఎమ్మెల్యేలు అఖిలేష్ పక్షాన ఉండటం వల్లే, తాను నిర్వహించనున్న సమావేశానికి అతి తక్కువ మంది హాజరవుతారని భావించిన ములాయం, ఈ సమావేశాన్ని రద్దు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ వారంలో యూపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు వారి స్థానాలకు వెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
  

  • Loading...

More Telugu News