: వారికి ఆల్ ది బెస్ట్: అనురాగ్ ఠాకూర్


రాజకీయనాయకుల ప్రమేయం క్రీడల్లో ఉండకూడదంటూ లోధా కమీషన్ సూచించిన విధంగా చేయలేదని ఆరోపిస్తూ బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలగిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంపై బీజేపీ ఎంపీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పందించారు. బీసీసీఐ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నానని అన్నారు.

రిటైర్డ్ జడ్జీల ఆధ్వర్యంలో బీసీసీఐ మెరుగ్గా పనిచేస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం భావిస్తే తమకు సంతోషమేనని ఆయన స్పష్టం చేశారు. బీసీసీఐ పగ్గాలు చేపట్టేవారికి ఆల్ ది బెస్ట్ అని పేర్కొన్నారు. బీసీసీఐ స్వయం ప్రతిపత్తి కోసమే తాము పాటుపడ్డామని ఆయన చెప్పారు. తమది వ్యక్తిగత పోరాటం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐది ప్రత్యేక స్థానమని ఆయన చెప్పారు. బీసీసీఐ సాయంతో రాష్ట్రాల క్రీడా సంఘాలు మెరుగైన క్రికెట్‌ సదుపాయాలు కల్పించామని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News