: ఓపెనర్ గా వచ్చి ఆశ్చర్యపరిచిన స్పిన్నర్!


వెస్టిండీస్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ సుదీర్ఘ కాలం క్రికెటర్ గా కొనసాగుతున్నప్పటికీ స్పెషలిస్టు బ్యాట్స్ మన్ గా తయారుకాని సంగతి తెలిసిందే. చివర్లో బ్యాటింగ్ కు దిగే సునీల్ నరైన్ ఇప్పటి వరకు ఒక్క అర్ధ సెంచరీ కూడా సాధించలేదు. టీ20ల్లో 28 పరుగులే అతను సాధించిన అత్యధికం. ఈ నేపథ్యంలో బిగ్ బాష్ లీగ్ లో మెల్ బోర్న్ రెనిగేడ్స్ తరపున ఆడుతున్న సునీల్ నరైన్ ఓపెనర్ గా బరిలోకి దిగాడు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా ప్రత్యర్థి మెల్ బోర్న్ స్టార్స్ జట్టు అవాక్కయింది. ఈ మ్యాచ్ లో 13 బంతులు ఎదుర్కొన్న నరైన్ 21 పరుగులు చేశాడు. కాగా, ఈ మ్యాచ్ చివర్లో వర్షం కురవడంతో సునీల్ నరైన్ జట్టు డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది. 

  • Loading...

More Telugu News