: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చెబితే నేను చచ్చిపోతాను!: తమన్నా


బాహుబలి వంటి సినిమాలో నటించే అవకాశం అరుదుగా వస్తుందని సినీ నటి తమన్నా తెలిపింది. అలాంటి అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదని తమన్నా చెప్పింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియాలంటే ఏప్రిల్ వరకు ఆగాలని చెప్పింది. అంతకు ముందు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చెబితే, ఇక తాను చచ్చిపోతానని నవ్వేసింది.

రాజమౌళి వంటి దర్శకుడితో పని చేయడం గర్వంగా ఉంటుందని చెప్పింది. రాజమౌళి అద్భుతమైన దర్శకుడని చెప్పింది. కథపై పూర్తి పట్టుతో ఉంటారని, ఆర్టిస్టుల నుంచి తనకు ఏం కావాలో అది తీసుకుంటారని తెలిపింది. బాహుబలిలో నటించడంతో తన స్థాయి పెరిగిందని తమన్నా చెప్పింది. తనకు భాషతో సంబంధం లేదని, జర్మనీలో నటించే అవకాశం వచ్చినా నటిస్తానని చెప్పింది. ఒకవేళ తాను రెమ్యూనరేషన్ పెంచినా, తనకు ఎంతివ్వలో నిర్మాతలు అంతే ఇస్తారని తమన్నా చమర్కరించింది. 

  • Loading...

More Telugu News