: వివిధ రాజకీయ పార్టీలను కలవక తప్పదు!: టీఆర్ఎస్ నేతలకు గట్టిగా బదులిచ్చిన కోదండరాం!
విపక్ష నేతలతో తెలంగాణ జేఏసీ కుమ్మక్కయిందన్న టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై ప్రొఫెసర్ కోదండరామ్ మండిపడ్డారు. ఒక ప్రజాకూటమిగా అనునిత్యం ఏదో ఒక అంశానికి సంబంధించి వివిధ రాజకీయ పార్టీలను కలవక తప్పదని... రాజకీయ పార్టీలతో కలసి పనిచేస్తే తప్పులేదని ఆయన అన్నారు. ప్రజల గొంతుకను వినిపించేందుకు జేఏసీ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ప్రభుత్వం నిర్బంధం విధించాలనుకుంటోందని... దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పారు. ప్రైవేట్ యూనిర్శిటీల బిల్లును వ్యతిరేకించడమే కాక... విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనవరి 7 నుంచి విద్యా పరిరక్షణ యాత్రను నిర్వహించనున్నామని తెలిపారు.