: క్రిష్టియానో రొనాల్డో నాకు ఆదర్శం...మెస్సీ మేధావి...రొనాల్డో కష్టపడతాడు!: కోహ్లీ
ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో తనకు ఆదర్శమని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. లియొనెల్ మెస్సీ మేధావి అని పేర్కొన్న కోహ్లీ, క్రిస్టియానో రొనాల్డో బాగా కష్టపడతాడని అన్నాడు. రొనాల్డోకి ఆటే డబ్బు, పేరు ప్రతిష్టలు, గౌరవం అన్నీ తీసుకొచ్చిందని అన్నాడు. అందుకే రొనాల్డో తనకు ఆదర్శమని అన్నాడు. ప్రతి మనిషిలోనూ బలహీనతలు, బలాలు ఉంటాయని అన్నాడు. తన బలాలు, బలహీనతలు పూర్తిగా తెలుసుకున్నానని చెప్పాడు.
వాటిపై బాగా దృష్టి పెట్టి, మరింతగా శ్రమించి టెస్టుల్లో పరుగులు సాధించడం నేర్చుకున్నానని తెలిపాడు. స్లిప్స్ లో నలుగురు ఫీల్డర్లు ఉన్నారని చూస్తావో, బౌండరీ లైన్ పై దృష్టి పెడతావో అంతా నీ ఇష్టమేనని కోహ్లీ చెప్పాడు. మైదానంలో దిగిన ప్రతిసారి ఒత్తిడి ఉంటుందని, అయితే ఒత్తిడిని గెలిస్తే ప్రపంచం గుర్తుంచుకునే ఆట ఆడవచ్చని, ఒత్తిడికి లొంగిపోతే ఓడిపోతామని కోహ్లీ అన్నాడు. ఒత్తిడిని తాను ఎంజాయ్ చేస్తానని, దానితో సహవాసం చేస్తూనే అద్భుతంగా ఆడడం అలవాటు చేసుకున్నానని కోహ్లీ తెలిపాడు.