: కమర్షియల్‌ రోదసి యానానికి ప్రయోగాలు ముగిశాయి


కమర్షియల్‌ బేసిస్‌ మీద రోదసిలో చుట్టి రావాలనుకునే ఔత్సాహిక సంపన్నులకోసం.. వ్యోమనౌకను రూపొందించే ప్రయోగాలు తుదిదశకు చేరుకున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన వ్యోమనౌక తొలిసారిగా ధ్వనిని మించిన సూపర్‌సోనిక్‌ వేగాన్ని అందుకుంది. స్పేస్‌షిప్‌ 2 అనే ఈ వ్యోమనౌకను వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ రూపొందించింది. ఈ విజయంతో రోదసియానం ప్రయోగాలు తుదిదశకు చేరుకున్నట్లేనట. ఇప్పటివరకు చేపట్టిన అనేక గగనతల పరీక్షల్లో ఈ సూపర్‌సోనిక్‌ వేగమే అత్యంత కీలకమైనదని వర్జిన్‌ గెలాక్టిక్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌ చెప్పారు.

అంతా సానుకూలంగా ఉంటే ఈ ఏడాది చివరికే అంతరిక్ష యాత్ర ఉంటుందని కూడా వెల్లడించారు. తాజా పరీక్షలు మోజావీ వైమానిక స్థావరంలో జరిగాయి. ఈ ప్రయోగాల్లో వ్యోమనౌక 55 వేల అడుగుల ఎత్తుకు చేరుకుంది.

  • Loading...

More Telugu News