: అలాంటి సినిమా చేయడానికి కూడా సిద్ధపడ్డానన్న బాలీవుడ్ హీరోయిన్!
మనసులో ఏదీ ఉంచుకోకుండా మాట్లాడేయడం బాలీవుడ్ భామ కంగనా రనౌత్ కు కొత్తేమీ కాదు. ఈ అమ్మడు ఇచ్చే బోల్డ్ స్టేట్ మెంట్స్ సంచలనం రేకెత్తిస్తుంటాయి. 2006లో 'గ్యాంగ్ స్టర్' సినిమాతో బాలీవుడ్ లోకి కంగనా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను చెబుతూ... దీనికి ముందు తనకు మరో సినిమా ఆఫర్ వచ్చిందని తెలిపింది. అది ఏమంత మంచి సినిమా కాకపోయినా... అప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమాను ఒప్పుకోవాల్సి వచ్చిందని... ఫొటో షూట్ కూడా చేశారని చెప్పింది.
ఆ తర్వాత తనకు ఇచ్చిన కాస్ట్యూమ్ రోబ్ లో దుస్తులేమీ లేవని... తాను నటించబోయేది నీలిచిత్రమేమో అనిపించిందని తెలిపింది. సరిగ్గా అదే సమయంలో 'గ్యాంగ్ స్టర్' మూవీలో అవకాశం రావడంతో... ఈ ప్రాజెక్టును వదిలేశానని చెప్పింది. సదరు సినిమా నిర్మాత తనపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడని తెలిపింది. అప్పట్లో తనకు 17, 18 ఏళ్ల వయసు ఉండేదని... అప్పుడున్న పరిస్థితుల్లో 'గ్యాంగ్ స్టర్' సినిమా రాకపోతే, ఆ సినిమాలో నటించేదాన్నని చెప్పింది.