: ఏమాత్రం తగ్గని షమీ... భార్యతో కలసి ఉన్న మరో ఫొటోను అప్ లోడ్ చేసిన వైనం!


కొన్ని రోజుల క్రితం టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ ట్విట్టర్లో అప్ లోడ్ చేసిన ఓ ఫొటో దుమారం రేపిన సంగతి తెలిసిందే. స్లీవ్ లెస్ డ్రెస్ లో ఉన్న తన భార్యతో కలసి ఉన్న ఫొటోను షమీ ట్విట్టర్లో పెట్టాడు. దీంతో, ముస్లిం వర్గానికి చెందిన పలువురు మండిపడ్డారు. నీవసలు ముస్లింవేనా? నీ భార్య ముస్లిమేనా? అంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో అనేక మంది షమీకి మద్దతుగా కూడా నిలిచారు.

ఇంత జరిగినా షమీ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. తన భార్యను ప్రేమగా దగ్గరకు తీసుకున్న ఫొటోను తాజాగా అప్ లోడ్ చేశాడు. అంతేకాదు... "నిన్ను చూసిన తొలి క్షణంలోనే నాకు మంచి తోడు దొరికిందని భావించాను, కొత్త సంవత్సర శుభాకాంక్షలు", అంటూ భార్యపై తనకు ఎంత ప్రేమ ఉందో వెల్లడిస్తూ కామెంట్ పోస్ట్ చేశాడు. అంతేకాదు, 2017లో అందరికీ మంచి జరగాలని... తన స్నేహితులంతా సంతృప్తికర జీవితం గడపాలని అభిలషించాడు.

  • Loading...

More Telugu News