: నెల రోజుల్లో మూడోసారి... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు
సామాన్యుడి నెత్తిన మరోసారి పోట్రో బాంబు పడింది. గత నెల రోజుల వ్యవధిలో ఇప్పటికే రెండు సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచిన కేంద్ర ప్రభుత్వం... నూతన సంవత్సరం కానుకగా మూడో సారి వీపు విమానం మోత మోగించింది. లీటర్ పెట్రోల్ ధరను రూ. 1.29, డీజిల్ ధరను రూ. 97 పైసలు పెంచింది. ఈ ధరకు స్టేట్ ట్యాక్సులు కూడా కలుపుకుంటే హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 73.56కు చేరింది. లీటర్ డీజిల్ రేటు రూ. 61కి పెరిగింది. పెరిగిన ఈ ధరలు నిన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయని... అందుకే పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచక తప్పలేదంటూ పాత పాటనే పాడాయి పెట్రోలియం కంపెనీలు. మరోవైపు, ఈ మూడు విడతల్లో మొత్తంమీద పెట్రోలియం ధరలు రూ. 6 వరకు పెరిగాయి.