: బ్రిటన్‌పై రసాయన దాడికి ఐఎస్ ఉగ్రవాదుల కుట్ర.. రక్షణ మంత్రి వెల్లడి
బ్రిటన్‌పై రసాయన దాడి జరిపేందుకు ఐఎస్ ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలెస్ పేర్కొన్నారు. ఇరాక్‌లోని మోసుల్‌లో జరిగిన యుద్ధంలో బ్రిటన్ సైనికులు కూడా పాల్గొన్నారు. వీరు తిరిగి స్వదేశానికి రావడానికి సిద్ధపడుతున్న సమయంలో ఈ వార్తలు రావడం ఆందోళన కలిగిస్తున్నాయి. బ్రిటన్ పౌరులను పెద్ద సంఖ్యలో హత్య చేయడమే లక్ష్యంగా దాడి జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రసాయన దాడి జరిపేందుకే ఉగ్రవాదులు మొగ్గుచూపుతున్నారని అన్నారు. అయితే వారు ఎటువంటి ఆయుధాలు వాడతారన్న విషయంలో స్పష్టత లేదన్నారు. ఉగ్రవాదుల నుంచి ఎదురయ్యే ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని వాలెస్ పేర్కొన్నారు.