: రెండేళ్ల దీక్షకు ఈ నెల 11తో చెక్.. గడ్డం తీయించుకోనున్న ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి దీక్షకు ఫలితం దక్కనున్న నేపథ్యంలో ఈ నెలలో ఆయన గడ్డం తీయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. గండికోట రిజర్వాయర్ నుంచి పైడిపాళెం ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తీసుకొచ్చి పులివెందుల ప్రాంత రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్న సంకల్పంతో 18 నెలలుగా ఆయన గడ్డం పెంచుతూ దీక్ష చేస్తున్నారు. పైడిపాళెం ప్రాజెక్టుకు కృష్ణా జలాలను మోసుకెళ్లే పంపింగ్ పథకాలను ఈ నెల 11న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. పథకాల ప్రారంభంతో సతీష్ రెడ్డి సంకల్పం నెరవేరబోతోంది. ఈ నేపథ్యంలో అదే రోజు పైడిపాళెం సమీపంలో ఉన్న సాయిబాబా గుడి వద్ద ఆయన గడ్డం తీయించుకుని దీక్ష విరమించనున్నారు.