: విశాఖలో ఫుడ్ పాయిజన్.. మాంసాహారం తిన్న 150 మందికి అస్వస్థత
ఓ ఫంక్షన్‌లో మాంసాహారం తిన్న పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విశాఖపట్నంలోని కె.కోటపాడు మండలం మర్రివలసలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంక్షన్‌కు హాజరైన 150 మంది అతిథులు విందులో వడ్డించిన మాంసాహారం తిన్న వెంటనే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని కె.కోటపాడులోని ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజనే ఈ ఘటనకు కారణమని వైద్యులు తెలిపారు. బాధితులకు ప్రాణాపాయం ఏమీ లేదని, కోలుకుంటున్నారని వారు పేర్కొన్నారు.