: ఎస్పీ నేత ములాయంకు అస్వస్థత.. ఆందోళనలో పార్టీ నేతలు
సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ములాయంసింగ్ యాదవ్ ఆదివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయన అధిక రక్తపోటుకు గురికావడంతో వెంటనే ఆయన నివాసానికి చేరుకున్న వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. ములాయం అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులతోపాటు పార్టీ నేతలు ఆందోళనకు గురయ్యారు. గత రెండు రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో తీవ్ర కలత చెందడం వల్లే ఆయన ఆనారోగ్యానికి గురైనట్టు చెబుతున్నారు. ములాయం అస్వస్థతకు గురైన వార్త తెలుసుకున్న శివపాల్ యాదవ్ వెంటనే ములాయం ఇంటికి చేరుకుని పరామర్శించారు.