: త్వరలో 'చిన్నమ్మ'కు సీఎం పగ్గాలు.. తేల్చిచెప్పిన మంత్రులు
అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ త్వరలో సీఎం పీఠాన్ని కూడా అధిష్ఠిస్తారని మంత్రులు స్పష్టం చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా మంత్రులు ఆర్పీ ఉదయ్‌కుమార్, కడంటూరు రాజు, సేవూరు రాజు తదితరులు మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద ఆదివారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శశికళ త్వరలోనే సీఎం పదవి చేపట్టనున్నట్టు తెలిపారు. పార్టీని కంటికి రెప్పలా కాపాడతానని శశికళ పేర్కొనడాన్ని ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. జయ మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకోవాలని సూచించింది కూడా ఈ ముగ్గురు మంత్రులే కావడం గమనార్హం. ఇప్పుడు మళ్లీ వీరే చిన్నమ్మ సీఎం పగ్గాలు చేపడతారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.