: 17 మంది పిల్లలకు జన్మనిచ్చి.. గ్రామస్తులు నచ్చజెప్పడంతో చివరికి కు.ని. ఆపరేషన్‌ చేయించుకున్న మ‌హిళ‌


గుజరాత్‌లోని దహోడ్‌ జిల్లా జరిబుజర్గ్ గ్రామంలో నివ‌సించే రామ్‌ సిన్హ్ (44)‌, కను సంగోత్‌ (40) అనే దంపతులకు దేశంలోనే ఎవ‌రికీ లేనంత మంది పిల్ల‌లు ఉన్నారు. ఒక‌రి త‌రువాత ఒక‌రిని కంటూనే ఉన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 17 మంది పిల్లలకు జన్మనిచ్చారు. వారిలో 16 మంది కుమార్తెలు కాగా, ఓ కొడుకు ఉన్నాడు. 18వ బిడ్డ‌నూ కందామ‌ని అనుకున్నారు. అయితే, గ్రామస్తులు నచ్చజెప్పడంతో రామ్ సిన్హ్ తాజాగా త‌న‌ భార్యకు కుటుంబ నియంత్రణ శ‌స్త్ర‌చికిత్స‌ చేయించాడు.

తమ‌కు కుమారుడు కావాలని కోరుకున్న ఈ దంప‌తులు వ‌రుస‌గా 14 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చారు. చివ‌రికి 2013లో ఓ కొడుకు జన్మించాడు. అయిన‌ప్ప‌టికీ మరో కొడుకు కావాలన్న వారి కోరికతో 2015, 2016ల‌లో మ‌రో ఇద్ద‌రు పిల్ల‌ల్ని క‌న్నారు. అయితే మ‌రో ఇద్ద‌రు ఆడపిల్లలు పుట్టారు. ఎట్ట‌కేల‌కు గ్రామస్తులు క‌ల్పించుకొని వారికి నచ్చజెప్పడంతో ఆపరేషన్‌ చేయించుకునేందుకు ఒప్పుకున్నారు.

  • Loading...

More Telugu News