: పడవలో వ్యాపించిన మంటలు.. 23 మంది మృతి
ప్రయాణికులతో వెళుతున్న ఓ పడవలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో 20 మంది అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఇండోనేషియాలోని జకర్తాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 17 మంది గల్లంతు కాగా, 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో పడవలో 200 మంది ప్రయాణికులు ఉన్నారని, పడవలో టిడుంగ్ ఐల్యాండ్ వద్ద మంటలు చెలరేగాయని అక్కడి అధికారులు తెలిపారు. ఈ పడవ ఫైబర్ తో తయారైనది కాబట్టి నీటిలో మునిగిపోలేదని తెలిపారు. ఈ పడవలో ఎక్కువ మంది విదేశీయాత్రికులే ఉన్నారని అన్నారు.