arujaitly: ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 2017లోనూ ఆర్థిక వృద్ధి కొన‌సాగుతుంది: అరుణ్‌జైట్లీ


భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధి కోసం కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న గట్టి చర్యలతో భారత్ ఈ ఏడాది కూడా అర్థిక రంగంలో తన స్థానాన్ని కొనసాగిస్తుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఆర్థికరంగంలో భారత్ మంచి ఆర్థిక‌ వృద్ధి సాధించింద‌ని, 2017లోనూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో భారత్‌ తన స్థానాన్ని కొనసాగిస్తుందని ఆయ‌న విశ్వాసం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నిన్న రాత్రి చేసిన ప్ర‌సంగంతో ఈ సంవ‌త్స‌ర‌ ఎజెండాను ప్రజల ముందు ఉంచార‌ని చెప్పారు. జీఎస్‌టీ అమలు, న‌గ‌దుర‌హిత లావాదేవీల‌ ఆర్థిక వ్యవస్థ కలిసి ఈ ఏడాది భారత్‌ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News