: కిరణ్ బేడీకి అశ్లీల వీడియో పంపిన ఆఫీసర్


పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న కిరణ్ బేడీకి 30కి పైగా అశ్లీల వీడియోలు, మెసేజ్ లను పంపిన శివకుమార్ అనే ప్రభుత్వ అధికారిపై వేటు పడింది. కిరణ్ బేడీ ఓ వాట్స్ యాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా, అన్ని శాఖల అధికారులనూ గ్రూప్ సభ్యులుగా చేర్చారు. తన దృష్టికి వచ్చిన సమస్యలపై సత్వర ఆదేశాలు ఈ గ్రూప్ ద్వారానే ఆమె జారీ చేస్తుంటారు. ఇక శుక్రవారం రాత్రి ఈ గ్రూప్ కు మూడు ఫోల్డర్లలో వీడియో వచ్చింది. దీన్ని చూసిన కిరణ్ బేడీ సహా అధికారులు అవాక్కయ్యారు. అసభ్య మెసేజ్ లు, వీడియోలు ఇందులో ఉన్నాయి. ఆ వెంటనే సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ మనోజ్ ప్రీతాను కిరణ్ బేడీ ఆదేశించారు. సీనియర్ ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరిగిందని, శివకుమార్ ను అదుపులోకి తీసుకున్నామని, ఆయన్ను విధుల నుంచి తొలగించామని పుదుచ్చేరి ప్రభుత్వం పేర్కొంది.

  • Loading...

More Telugu News