: ధైర్యముంటే నన్ను కాదని వెళ్లండి: ములాయం వర్గానికి అఖిలేష్ సవాల్


యూపీ ప్రజా ప్రతినిధుల్లో నేరస్తులకు స్థానం లేకుండా చేయడమే తన లక్ష్యమని సీఎం అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. తనను సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించిన తరువాత లక్నోలో వేలాది మంది కార్యకర్తలను, పార్టీ ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ధైర్యముంటే తనను కాదని పార్టీని చీల్చి చూడాలని ములాయం, శివపాల్ వర్గానికి సవాల్ విసిరారు. తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ కు అమిత గౌరవాన్ని ఇస్తానని చెబుతూనే, ఆయన వెనుక చేరిన కొందరు తప్పుడు సలహాలు ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు. పార్టీ చీలిపోతుందని తాను భావించడం లేదని, తన తండ్రి నిజం గ్రహిస్తారనే అనుకుంటున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News