: సమాజ్ వాదీలో పెను సంక్షోభం... ములాయంను కాదని అఖిలేష్ ను అధ్యక్షుడిగా ప్రకటించిన పార్టీ జాతీయ కార్యవర్గం


సమసిపోయిందనుకున్న వివాదం తిరిగి పెను సంక్షోభంలా మారింది. ములాయం కుటుంబంలో మరో ముసలం పుట్టింది. లక్నోలో ఈ ఉదయం రాంగోపాల్ ఆధ్వర్యంలో సమావేశమైన సమాజ్ వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సీఎం అఖిలేష్ ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. పార్టీ నేత ములాయం వర్గం ఈ సమావేశానికి దూరంగా ఉంది. ఈ సభకు దాదాపు 200 మందికి పైగా సమాజ్ వాదీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశానికి వెళ్లవద్దంటూ ఎమ్మెల్యేలను ములాయం హెచ్చరించినప్పటికీ, ఎవరూ లెక్క పెట్టలేదు. అఖిలేష్ ఒంటరిగా సభ నిర్వహించడంపై ములాయం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. సమాజ్ వాదీలో తాజా పరిణామాలు ఎంతవరకూ దారితీస్తాయో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News