: ఫ్యామిలీలతో కలసి ఒకేచోట న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న మహేష్ బాబు, రాం చరణ్... ఉపాసన షేర్ చేసిన ఫోటో ఇది!


ప్రిన్స్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కుటుంబాలు ఈ సంవత్సరం న్యూ ఇయర్ వేడుకను కలసి జరుపుకున్నాయి. స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో వీరు పార్టీ చేసుకున్నారు. మహేష్ భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, రాంచరణ్ భార్య ఉపాసనలతో పాటు గల్లా జయదేవ్ ఫ్యామిలీ కూడా ఈ వేడుకలో భాగం పంచుకున్నట్టు తెలుస్తోంది. వీరి న్యూ ఇయర్ పార్టీకి సంభంధించిన ఫోటోలను ఉపాసన తన ట్విట్టర్ ఖాతాద్వారా పంచుకుంటూ, నూతన సంవత్సరం శుభాకాంక్షలను తెలిపింది. ఇప్పుడా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు భుజంపై చెయ్యి వేసి నిలుచున్న రాంచరణ్, ఆ పక్కనే ఉపాసన, నమ్రత ఉన్న చిత్రాన్ని మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News