: బిజినెస్ హాలిడేస్... 2017లో భారత స్టాక్ మార్కెట్ సెలవుల లిస్టు!
2017 సంవత్సరంలో భారత స్టాక్ మార్కెట్ కు సెలవుల వివరాలను బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రకటించింది. ఈ సంవత్సరంలో శని, ఆది వారాలకు అదనంగా మొత్తం 13 సెలవులను బీఎస్ఈ ప్రకటించింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం (గురువారం), ఫిబ్రవరి 24న మహాశివరాత్రి (శుక్రవారం), మార్చి 13న హోలీ (సోమవారం), ఏప్రిల్ 4న శ్రీరామనవమి (మంగళవారం), ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి (శుక్రవారం), మే 1న మహారాష్ట్ర దినోత్సవం, మేడే (సోమవారం), జూన్ 26న రంజాన్ (సోమవారం), ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం (మంగళవారం), ఆగస్టు 25 వినాయకచవితి (శుక్రవారం), అక్టోబర్ 2 గాంధీ జయంతి (సోమవారం), అక్టోబర్ 19 దీపావళి (గురువారం), అక్టోబర్ 20 దీపావళి బలిప్రతిపద (శుక్రవారం), డిసెంబర్ 25 క్రిస్మస్ (సోమవారం) సందర్భంగా మార్కెట్ కు సెలవులని ప్రకటించింది. కాగా, అక్టోబర్ 19న లక్ష్మీపూజ సందర్భంగా ప్రత్యేక మూరత్ ట్రేడింగ్ జరగనుంది.