: చంపండి, నరకండి... కిడ్నాప్ లు చేయండి.. బాంబులు పేల్చండి!: 'బోకోహరామ్' చీఫ్ వీడియో సందేశం


నైజీరియాలో వేళ్లూనుకుని పలు దేశాలను గడగడలాడిస్తున్న ఉగ్రవాద సంస్థ బోకోహరామ్ తాజా వీడియో సందేశాన్ని యూట్యూబ్ లో విడుదల చేసింది. బోకోహరామ్ నాయకుడు అబూ బకర్ షెకావు ఈ వీడియోలో మాట్లాడుతూ, తన అనుచరులకు సందేశం ఇచ్చాడు. తనను చంపుతామని నైజీరియా సైన్యం మూడుసార్లు ప్రకటించి విఫలమైందని, తాను గాయపడ్డానని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, తాను క్షేమమని చెప్పాడు. "ఇస్లాం వ్యతిరేకులను చంపండి, నరకండి. కిడ్నాప్ లు చేయండి. బాంబు పేలుళ్లతో విరుచుకుపడండి" అంటూ షెకావు రెచ్చిపోయాడు. ఇప్పుడే యుద్ధం ప్రారంభమైందని చెప్పాడు. నైజీరియాను ఇస్లాం రాజ్యంగా మార్చేందుకు జీహాదీలు కదలి రావాలని సూచించాడు.

  • Loading...

More Telugu News