: కూకట్ పల్లి వద్ద ట్రావెల్స్ బస్సు దగ్ధం
హైదరాబాద్ పరిధిలోని కూకట్ పల్లి వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్థమైంది. ఈ తెల్లవారుజామున ఐడీఎల్ వద్ద నిలిపివుంచిన బస్సులో ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఎవరైనా కావాలనే బస్సుకు నిప్పు పెట్టారా? లేక ప్రమాదవశాత్తూ ఘటన జరిగిందా? అన్నది తెలియాల్సివుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలికి వచ్చి పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.