: బీఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ బంపర్ ఆఫర్


జియో విప్లవంతో టెలికాం రంగంలో పోటీ పెరిగింది. రిలయన్స్ జియో 149 రూపాయలతో అన్ లిమిటెడ్ టాక్ టైమ్, 300 ఎంబీ డేటా వినియోగంలోకి తీసుకురాగా, కాస్త ఆలస్యంగానైనప్పటికీ న్యూఇయర్ కానుకగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎఎల్ సరికొత్త బంపర్ ఆఫర్ తో రంగప్రవేశం చేసింది. అన్ లిమిటెడ్ కాలింగ్ పేరిట తీసుకొచ్చిన ఈ పథకంలో కేవలం 144 రూపాయలకే అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు 300 ఎంబీ డేటాను ఆఫర్ చేస్తోంది. దీని వ్యాలిడిటీ ఆరు నెలలు ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

మరోవైపు బీఎస్ఎన్ఎల్ దేశ్యాప్తంగా 4400 వైఫై హాట్ స్పాట్లను లాంచ్ చేసింది. చెన్నైలోని మహాబలిపురంలో త్వరలో హాట్ స్పాట్ లాంచ్ చేయనున్నామని చెప్పింది. హాట్ స్పాట్ ల విస్తరణే తమ తదుపరి లక్ష్యమని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. 2017 పూర్తయ్యేనాటికి దేశవ్యాప్తంగా సుమారు 40 వేల హాట్ స్పాట్ లను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. 

  • Loading...

More Telugu News