: సాహసోపేతమైన నిర్ణయం.. ఫలితాలు సమీప భవిష్యత్తులో చూస్తారు!: ప్రధాని మోదీ


'మేరే ప్యారే సవాసౌ కరోడ్ దేశ్ వాసియో....నయాసాల్ కీ ముబారక్' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సాయంకాలం జాతినుద్దేశించి ఆయన మాట్లాడుతూ, దీపావళి తరువాత చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలంతా చాలా సాహసం ప్రదర్శించారన్నారు. దాని ఫలితాలు సమీప భవిష్యత్ లో చూస్తారని ఆయన చెప్పారు. సాహసోపేతమైన నిర్ణయం తరువాత చోటుచేసుకున్న సంఘటనలు తమను ఆవేదనకు గురిచేశాయని చెప్పారు. ఎన్నో సందర్భాల్లో దేశ ప్రజలు దేశభక్తిని చూపించారని, నల్లధనం, నకిలీ నోట్లు, భ్రష్టాచార్ (అవినీతిని)ను రూపుమాపేందుకు వెనకడుగు వేసేది లేదని నిరూపించారన్నారు. నవంబర్ 8 తరువాత చోటుచేసుకున్న పరిస్థితులు తమను పునరాలోచించేలా చేశాయని చెప్పారు. మీ డబ్బులు మీరు తీసుకునేందుకు మీరు బ్యాంకు క్యూలైన్లలో నిల్చున్నారని ఆయన చెప్పారు. ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న ఘటనలను ఎంతగా ప్రశంసించినా సరిపోదని అన్నారు.


  • Loading...

More Telugu News