: అంతరిక్షంలోని టెలిస్కోపు ఆగిపోయింది


టెలిస్కోపు అంటే అంతరిక్షంలోని, సుదూరప్రాంతాల్లోని విశేషాలను మనం చూసి ఆనందించడానికి వాడేది. అయితే.. భూమి మీదనుంచి కాకుండా.. అంతరిక్షంలోంచే.. అంతరిక్షంలోని మరింత సుదూర అందాలను చూపిస్తూ మూడేళ్ల పాటు సేవలు అందించిన అతిపెద్ద టెలిస్కోపు శాశ్వతంగా పనిచేయడం మానేసింది.

అంతరిక్ష రహస్యాలను భూమ్మీదనుంచి టెలిస్కోపుల ద్వారా తెలుసుకోవడం కంటె మరింత మెరుగైన అధ్యయనం కోసం యూరోపియన్‌ స్పేస్‌ ఏజన్సీ వారు అతిపెద్ద పరారుణ టెలీస్కోపు హెర్స్‌చెల్‌ను రోదసిలోకి 2009లో పంపారు. దీని ద్వారా చాలా అంతరిక్ష రహస్యాల పరంగా అనేకానేక కొత్త విషయాలు ఆవిష్కృతం అయ్యాయి. అయితే, ఈ హెర్స్‌చెల్‌ టెలిస్కోపు పరికరాలను నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద ఉంచే ద్రవరూప హీలియం అడుగంటిపోవడంతో.. టెలిస్కోపు వేడెక్కి పనిచేయడం ఆగిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

  • Loading...

More Telugu News