: నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేసిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
ఆస్ట్రేలియా నూతన సంవత్సరంలోకి ప్రవేశించింది. 2017వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సిడ్నీలోని ఒపెరాహౌస్ బాణాసంచా వెలుగులతో మెరిసిపోయింది. నూతన సంవత్సర సంబరాల సందర్భంగా సిడ్నీలో బాణసంచా వెలుగులను వీక్షించేందుకు భారీ ఎత్తున స్థానికులు, పర్యాటకులు సిడ్నీ హార్బర్ కు చేరుకున్నారు. కేరింతలు, తుళ్లింతల మధ్య ఆస్ట్రేలియన్లు 2016కు వీడ్కోలు పలుకుతూ, 2017కు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. బాణసంచా వెలుగులతో సంబరాలు అంబరాన్నంటాయి. న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో కూడా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. హార్బర్ లైట్ హౌస్ లో ప్రారంభించిన కౌంట్ డౌన్ 0కు చేరగానే ఒకరినొకరు కౌగిలించుకుని తమ హర్షాతిరేకాలను తెలుపుకున్నారు.