: 7:30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని


'సరిగ్గా 50 రోజులు వేచి చూడండి, నల్లధనాన్ని అంతం చేస్తా'నంటూ నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటికి 50 రోజుల గడువు ముగిసిపోయింది. దీనిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ నేటి సాయంత్రం 7:30 నిమిషాలకు జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. ఈ మేరకు పీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి తోడు 'రెండు రోజుల్లో శుభవార్త వింటారు' అంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా పేర్కొన్న నేపథ్యంలో ప్రధాని ఏం చెప్పనున్నారు? ఏ తాయిలాలు ప్రకటించనున్నారు? అన్న దానిపై ఆసక్తి రేగుతోంది. 

  • Loading...

More Telugu News