: అమెరికాలో రోడ్డుపై ఆవు... వాహనచోదకులను తికమక పెట్టింది.. ఇలా!
అమెరికాలో ఆవులను తరలిస్తున్న ఓ వాహనం అదుపు తప్పడంతో, అందులో నుంచి ఒక ఆవు రోడ్డుపైకి వచ్చేసిన సంఘటన నిన్న రాత్రి నెబ్రస్కాలోని ఒమహాలో చోటుచేసుకుంది. దీంతో, ఎటువైపు వెళ్లాలో తెలియని ఆవు.. రోడ్డుపై అటుఇటూ పరుగులు తీసింది. ఈ ఊహించని పరిణామానికి వాహనచోదకులు తికమకపడ్డారు. ఈ క్రమంలో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ గా మారింది.