: ప్రతి ఒక్కరూ మరణిస్తారని కేకలు వేసి మరీ విమానాన్ని ఆపేశాడు!


విమాన ప్రయాణంలో ఎంత అప్రమత్తంగా ఉంటారో వెల్లడించే ఘటన రష్యాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రష్యాలోని కర్సాందొర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆస్ట్రేలియాకు చెందిన ఎయిర్ ఫ్లోట్ విమానం మాస్కోకు బయల్దేరేందుకు సిద్ధంగా ఉంది. ప్రయాణికులంతా తమతమ సీట్లలో కూర్చున్నారు. వారిలోంచి ఓ వయసు మళ్లిన వ్యక్తి ఒక్కసారిగా సీట్లోంచి లేచి 'తాను దెయ్యాలను చూడగలనని, మీరంతా చచ్చిపోతారు' అని అరవడం ప్రారంభించాడు.

దీంతో విమానంలోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. విమానాశ్రయాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆయనను విమానం నుంచి కిందికి దించేశారు. అనంతరం ఆయన తీవ్రవాదేమోనన్న భయంతో విమానంలో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించకపోవడంతో విమానాన్ని గమ్యానికి రెండు గంటలు ఆలస్యంగా పంపించారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన విమాన ప్రయాణికుడు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. 

  • Loading...

More Telugu News