: చంద్రబాబు ప్రచార ఆర్భాటం ఓ ఇంజనీరు ప్రాణం మీదకు తెచ్చేది: రఘువీరా
పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే ప్రమాణస్వీకారం కూడా చేయనంటూ ప్రధాని మోదీతో చెప్పినట్టు చంద్రబాబు అనడం పచ్చి అబద్ధమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. చంద్రబాబుకు అబద్ధాల రోగం వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆ మండలాలను ఏపీలో కలుపుతూ యూపీఏ ప్రభుత్వం అప్పట్లోనే ఆర్డినెన్స్ జారీ చేసిందని చెప్పారు. కేవలం కమిషన్ల కోసమే కేంద్ర ప్రభుత్వం చేతుల్లోంచి పోలవరాన్ని చంద్రబాబు తీసుకున్నారని ఆరోపించారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాలని కోరుకుంటున్నానని తెలిపారు. చంద్రబాబుకు ప్రచార ఆర్భాటం ఎక్కువైందని... పోలవరం స్పిల్ వే మూడో పియర్ వద్ద ఆయన ప్రచార ఆర్భాటం ఓ ఇంజనర్ ప్రాణం మీదకు తెచ్చేదని అన్నారు.