: అరుణాచల్ ముఖ్యమంత్రిపై క్రమశిక్షణ చర్యతో ఖాళీ అవుతున్న పీపీఏ...లాభం బీజేపీది!
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫెమా ఖండూపై సస్పెన్షన్ వేటు వేయడంతో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ (పీపీఏ) పార్టీ సంక్షోభంలో కూరుకుపోయింది. ఫెమా ఖండూపై సస్పెన్షన్ వేటు వేయగానే మేమున్నామంటూ మద్దతిచ్చేందుకు బీజేపీ ముందుకు వచ్చింది. దీంతో ఫెమా ఖండూ పదవికి ఎలాంటి ప్రమాదం లేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం, ముఖ్యమంత్రి వర్గం అంటూ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ క్రమంలో పీపీఏ నుంచి 33 మంది ఎమ్మెల్యేలు సీఎంకు మద్దతిచ్చిన బీజేపీలో చేరిపోయారు. దీంతో పీపీఏలో కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.