: సొంత జట్టుతో నాగపూర్ లో ధోనీ ప్రాక్టీస్


టీమిండియా కెప్టెన్ ధోనీ నాగపూర్ లో ప్రాక్టీస్ ప్రారంభించాడు. ధోనీ నేతృత్వంలోని జార్ఖండ్ రంజీ జట్టు తొలిసారి రంజీల్లో ఫైనల్ చేరింది. నాగపూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ధోనీ జట్టు గుజరాత్ తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ధోనీ తన జట్టు సభ్యులతో ప్రాక్టీస్ చేస్తున్నాడు. తద్వారా జనవరి 15 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కు సన్నద్ధం కావడంతో పాటు యంగ్ స్టర్స్ కు సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నాడు. ధోనీ సలహాలతో తమ జట్టు ఫైనల్లో విజయం సాధిస్తుందని జార్ఖండ్ బోర్డు భావిస్తోంది.

ఇదిలా ఉంచితే, టెస్టుల్లో ఆడిన ఆటగాళ్లంతా మంచి ఫాంతో సత్తా చాటి టోర్నీని అద్భుత రీతిన రాణించి సొంతం చేసుకోవడంతో ధోనీపై ఒత్తిడి నెలకొంది. టోర్నీని ఎలాగైనా సరే గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. లేని పక్షంలో విమర్శకులకు సమాధానం చెప్పడంలో ధోనీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ కోహ్లీకి అప్పగించాలన్న డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇంగ్లండ్ తో జరగనున్న వన్డే, టీ20 టోర్నీలను ధోనీ గెలవాల్సిన అవసరం ఉంది. 

  • Loading...

More Telugu News