: పోలిష్ చార్టర్ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు...అత్యవసర ల్యాండింగ్
పోలిష్ చార్టర్ ఎయిర్ లైన్స్ కి చెందిన బోయింగ్ 707 విమానంలో బాంబు పెట్టినట్టు ఫోన్ కాల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో వెంటనే విమానాన్ని ల్యాండ్ చేసి తనిఖీలు నిర్వహించారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు లేకపోవడంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. బ్రెజిల్ లోని లాస్ పల్మాస్ నుంచి పోలండ్ లోని వెర్సాకు వెళ్తుండగా చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ కు దగ్గర్లో ఈ ఘటన చోటుచేసుకోగా, విమానాన్ని ప్రేగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఈ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. విమానాన్ని క్షణ్ణంగా తనిఖీ చేశామని, ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి తిరిగి ప్రయాణికులతో గమ్యస్థానానికి తీసుకెళ్లారు.