: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శశికళ
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు చేపట్టారు. తన కుర్చీలో కూర్చోబోయే ముందు దివంగత సీఎం జయలలిత చిత్రపటానికి శశికళ నమస్కరించారు. కాగా, అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం శశికళ పోస్టర్లతో నిండిపోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలను స్వీకరించడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు సందడి చేశారు. కాగా, మరి కొద్ది సేపట్లో, శశికళ మీడియా ముందు మాట్లాడనున్నారు.