: మధ్యాహ్న భోజనంలో చేపల కూర చేర్చండి: పొంగులేటి డిమాండ్
మధ్యాహ్న భోజన పథకం ద్వారా చిన్నారులకు అందిస్తున్న భోజనం మెనూలో చేపల కూరను కూడా చేర్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారానికి ఒక రోజైనా చేపల కూర పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చేపల కూర తినడం వల్ల, చిన్నారులకు చాలా మేలు జరుగుతుందని చెప్పారు. శుక్రవారం నాడు శాసనమండలిలో మత్స్య పరిశ్రమపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఈ డిమాండ్ చేశారు.