: ఉచితంగా వస్తువులు ఇవ్వడమే వారి వినూత్న ఆలోచన... వ్యాపారంలో దూసుకెళుతున్న ముగ్గురు మిత్రులు


ఒక వినూత్న ఆలోచన జీవితాన్నే మార్చేస్తుందని మరోసారి నిరూపణ అయింది. అన్నీ ఉచితంగా ఇస్తామంటూ వీరు ప్రారంభించిన సంస్థ వారానికి 20 శాతం వృద్ధితో దూసుకుపోతోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ముంబైకి చెందిన రోహిత్‌ లాలా, అంకిత్ మూర్జానీ, అదిత్ దావేలది 15 ఏళ్ల స్నేహ బంధం. వీరికి ఓ వినూత్న ఆలోచన వచ్చింది. తమ యాప్ ద్వారా యాడ్స్ చూసే వాళ్లకు ఉచితంగా వస్తువులు ఇవ్వాలన్నదే వీరి ఆలోచన.

ఆ వెంటనే 'గ్రాబ్‌ స్టర్‌' అనే కంపెనీని స్థాపించి, ఓ యాప్ తయారు చేసి రంగంలోకి దిగిపోయారు. వీరి ఆలోచన నచ్చి వివిధ బ్రాండ్లు వ్యాపార ప్రకటనలు ఇచ్చాయి. వీరి యాప్ లో ఆయా సంస్థల యాడ్స్ వస్తుంటాయి. 15 సెకన్ల నిడివివున్న యాడ్ ను చూస్తే చాలు. ఓ లక్కీ డ్రాకు అర్హత పొందినట్టే. అదృష్టం ఉంటే వస్తువు వచ్చేస్తుంది. స్మార్ట్ ఫోన్లలో డేటా ఖర్చు గణనీయంగా తగ్గిన నేటి తరంలో గ్రాబ్ స్టర్ యాప్ కు అనూహ్యంగా మద్దతు పెరిగిపోయింది. ఇప్పుడు దాదాపు 75 బ్రాండ్స్ గ్రాబ్ స్టర్ కస్టమర్లుగా ఉండి, తమ యాడ్స్ ను ఇస్తున్నాయి. క్రియేటివిటీ ఉంటే అంతే మరి!

  • Loading...

More Telugu News